చదువును వదలనంటున్న కథానాయిక

* చదువును మాత్రం వదిలేది లేదు.. అంటోంది అందాల కథానాయిక అనుపమ పరమేశ్వరన్. డిగ్రీ చదువుతూ మధ్యలోనే వదిలేసి సినిమాల్లోకి వచ్చిన ఈ చిన్నది చెబుతూ, ‘చదువును మాత్రం ఎప్పుడూ వదలను. టైం చూసుకుని మళ్లీ కంటిన్యూ చేస్తాను. ఖాళీ దొరికినప్పుడు మళ్లీ పుస్తకాలు పట్టుకుంటాను. ప్రైవేటుగా చదివి డిగ్రీ మాత్రం సంపాదిస్తాను’ అని చెప్పింది.
* అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ హిందీ చిత్రానికి సంబంధించి అక్కినేని నాగార్జున తన షూటింగును పూర్తి చేశారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన గత కొన్ని రోజులుగా లండన్ లో ఈ చిత్రం షూటింగులో పాల్గొని, నిన్ననే తిరుగు ప్రయాణమయ్యారు.
* ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన కార్తికేయ ప్రస్తుతం బిజీ అవుతున్నాడు. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో కలైపులి ఎస్ థాను నిర్మించే చిత్రంలో హీరోగా నటిస్తున్న కార్తికేయ .. తాజాగా మరో చిత్రానికి సంతకం చేశాడు. నూతన దర్శకుడు మల్లికార్జున్ దర్శకత్వంలో మిరియాల రవీందర్ రెడ్డి దీనిని నిర్మిస్తారు.
Tags: nagarjuna movie,rx100,bramhasree

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *