జగన్ విషయంలో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో మాట్లాడితే …చంద్రబాబు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. సానుభూతి వ్యక్తపరిస్తే కూడా చంద్రబాబు ఓర్వలేడా?. లోకేష్ మాట్లాడింది కూడా కేంద్రం డైరెక్షన్‌లోనేనా అని ప్రశ్నించారు. రాష్ర్టానికి ప్రయోజనాలు కలిగే విషయంలో కేంద్రంతో సానుకూలంగా ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే కేంద్రాన్నైనా నిలదిస్తాం.
హరికృష్ణ చనిపోతే అధికారికంగా అంత్యక్రియలు చేస్తే తప్పు కాదు… జగన్‌పై జరిగిన దాడికి సాటి మనిషిగా స్పందిస్తే తప్పా అని అడిగారు. హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు మానవీయకోణంలో సీఎం కేసీఆర్ స్పందించలేదా. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు ఆపరేషన్ గరుడ లాంటిది చేపట్టలేదా. రేవంత్‌రెడ్డిని తన కోవర్టుగా కాంగ్రెస్‌లో చేర్పించిందే చంద్రబాబు అని విమర్శించారు.
Tags: Karne Prabhakar , MLC , Chandrababu Naidu , TDP