auto accident

ఘోర ప్రమాదం….14 మంది మృతి

అక్షిత ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిడ్జిల్‌ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది కూలీలు మృతిచెందారు. ఘటనా స్థలిలో 12 మంది మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌తో కలిపి 15 మంది ప్రయాణిస్తుండగా.. ప్రమాదం నుంచి డ్రైవర్‌ ఒక్కడే గాయాలతో బయటపడ్డాడు. కొత్తపల్లి, భోగ్యా తండాకు చెందిన కూలీలు పనులు ముగించుకుని ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కిక్కిరిసి ఉన్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న 12 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జనుజ్జయ్యింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనిబట్టి లారీ ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు. మృతుల వివరాలను పరిశీలిస్తే…
సేవియా, చాలమ్మ, వడ్డె చిన్నమ్మ, బాలమణి, బండారి ఎల్లమ్మ, రాగుల శివలీల, చంద్రమ్మ, శివాజీనాయక్‌, బి.వెంకటమ్మ, చాందీ, వెంకటమ్మ, బీచోడి.. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికుల ధర్నా..
గతంలోనూ ఇదే ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కొత్తపల్లి వాసులు ప్రమాద స్థలిలో ధర్నాకు దిగారు. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్లే రహదారిపై బైఠాయించారు. కొత్తపల్లి వద్ద రోడ్డు సరిగా లేని కారణంగానే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక్కడున్న మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించే పరిస్థితి లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అధికారులెవరూ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరి ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

 

 

tags : mahaboobnagar, lorry-auto accident

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *