ఘనంగా పంద్రాగస్టు వేడుకలు : శానంపూడి సైదిరెడ్డి

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని తెరాస కార్యాలయం లో ఘనంగా 73 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలునిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెరాస నియోజకవర్గ ఇంచార్జ్ శానంపుడి సైదిరెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం మరియు రాఖి పౌర్ణమి శుభాకాంక్షలుతెలిపారు.ఎంతోమంది త్యాగాలు, పోరాటాల వల్ల ఏర్పడ్డ భారతదేశం నేడు ప్రపంచంలోనే ఓ గుర్తింపు తెచ్చుకుందని అన్నారు.ఎంతోమంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు కెసిఆర్ పాలనలో బంగారు తెలంగాణగా రూపు దిద్దుకుందని అన్నారు.తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ తోటే అభివృద్ధి చెందుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,డా, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి,అట్లూరి హరిబాబు,జక్కుల వెంకయ్య, నర్సింగ్ వెంకటేశ్వర్లు,చిట్యాల అమర్నాధ్ రెడ్డి,పచ్చిపాల ఉపేందర్, రాయల వెంకటేశ్వర్లు, మన్సూర్ అలీ,కడియాల రామకృష్ణ,జక్కుల నాగేశ్వరరావు, గేల్లి రవి, గొట్టే రామయ్య,చింతమల్ల కవిత,దీప,విజయ,సైదమ్మ,సుశీల,కుంట సైదులు,రాము,సతీష్,తదితరులు పాల్గొన్నారు.

 

tags : trs, shanampudi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *