గణేష్ నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్

నల్గొండ,  అక్షిత ప్రతినిధి    : గణేష్ విగ్రహాల నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్          వి. చంద్రశేఖర్,డి.అర్. ఓ.,ట్రాన్స్ కో, ఎక్సైజ్,అగ్నిమాపక శాఖ,మత్స్య శాఖ, ఐ.బి.,ఎన్.ఎస్.పి.,అర్.డి. ఓ.లు,మున్సిపల్ కమిషనర్లు,డి.ఎస్.పి.లు,తహశీల్దార్లు,అర్&,బి అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు.వల్లభ రావు చెరువు,14 వ మైలు,మండలాలు, మున్సిపాలిటీల లో నిమజ్జనం ప్రాంతాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ట్రాన్స్ కో , అధికారులు లైటింగ్, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,మున్సిపల్,పంచాయతి అధికారులు విగ్రహాలు చెరువు నుండి తొలగింపు పరిశుభ్రం చేయుట, అర్&బి శాఖ బారికే డింగ్, క్రేన్ లా ఏర్పాటు, ఐ.బి,ఎన్.ఎస్.పి.అధికారులు నీటి మట్టం ఎక్కువుగా వున్న ప్రాంతంలో ప్రమాద సూచికలురక్షణ చర్యలు,,పోలీస్ శాఖ బందోబస్తు,ట్రాఫిక్ నియంత్రణ,వైద్య,ఆరోగ్య శాఖ అంబులెన్స్,ప్రథమ చికిత్స ఏర్పాట్లు,నిమజ్జనం చెరువుల వద్ద మత్స్య శాఖ గజ ఈత గాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అగ్నిమాపక శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని,రెవెన్యూ అధికారులు అర్.డి. ఓ.లు,తహశీల్దార్లు అన్ని శాఖల అధికారులతో ఈ నెల 11 న గణేష్ నిమజ్జనం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.సోమవారం అర్.డి. ఓ.లు.డివిజన్ స్థాయి లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి నిమజ్జనం ఏర్పాట్లు సమీక్షించాలని అన్నారు.రద్దీ ఎక్కువగా వున్న ప్రాంతంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు.మండల పర్యవేక్షణ అధికారులు
పర్యవేక్షణ చేయాలని అన్నారు.

 

 

tags : nlg collector, gourav Uppal, ganesh, utshavalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *