గట్టెక్కాలంటే ఛార్జీలు 70% పెంచాల్సిందే!
వొడాఫోన్ ఐడియాపై యాక్సిస్ క్యాపిటల్
అక్షిత నెట్వర్క్, దిల్లీ: వొడాఫోన్ ఐడియా కార్యకలాపాలు స్థిరంగా సాగాలంటే, ఛార్జీ(టారిఫ్)లను 70% వరకు పెంచాల్సి రావచ్చని యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది. ప్రస్తుతం వినియోగదారులపై వచ్చే సగటు ఆదాయం (ఆర్పు) రూ.107 ఉండగా, ఇది రూ.180కి చేరితే బాలెన్స్షీట్పై ఒత్తిడి తగ్గుతుందని వివరించింది. ఇందుకోసం ఛార్జీలు గణనీయంగా పెంచాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపు 12-24 నెలల వ్యవధిలో జరగొచ్చని అంచనా వేసింది. ప్రతి వినియోగదారుపై సగటు ఆదాయం పెరిగితే, నిర్వహణ లాభం ఏడాదికి రూ.21300 కోట్లకు చేరొచ్చని తెలిపింది. డిసెంబరు 1 నుంచి టారిఫ్లు పెంచుతామని ఇప్పటికే వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. అయితే ఎంతమేర పెంచబోతోందీ ఇంకా వెల్లడించలేదు.
నీ వినియోగదారులపై సగటు ఆదాయం 10% పెరిగితే, పరిశ్రమలోని కంపెనీలకు రాబోయే మూడేళ్లలో రూ.33,000 కోట్ల అదనపు ప్రతిఫలం లభిస్తుందన్నది టెలికాం విభాగం అంచనా.
నీ టారిఫ్లు 70% వరకు పెరిగితే పరిశ్రమకు రాబోయే మూడేళ్లలో రూ.2 లక్షల కోట్ల అదనపు ప్రతిఫలం లభిస్తుందని యాక్సిస్ క్యాపిటల్ వివరించింది.