గంగమ్మ జాతరలో సైదిరెడ్డి ప్రత్యేక పూజలు

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని గంగమ్మ జాతర మొదలుకావడంతో ఆ జాతరకు హుజూర్ నగర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శానంపూడి సైదిరెడ్డి హాజరు కావడం జరిగింది… యాదవ కులస్తులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు…. అనంతరం టీఆర్ఎస్ నాయకులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ముత్యాలమ్మ పండుగ కు ముందు గంగమ్మ జాతర నిర్వహించడం జరుగుతుందని.. ఆ గంగమ్మ జాతరలో నన్ను భాగస్వామ్యులుగా చేసి నందుకు యాదవ కుల పెద్దలకు, సోదరులకు, సోదరీమణులకు, కృతజ్ఞతలు తెలిపారు.. మరియు వారికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలపడం జరిగింది.వర్షాలు బాగా పడాలని పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లి ని వేడుకుంతున్నట్లు ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ జక్కుల వెంకయ్య, జక్కుల నాగేశ్వరరావు అట్లూరి హరిబాబు, గొట్టే రామయ్య జక్కుల వీరయ్య సంపత్ రెడ్డి కడియాల రామకృష్ణ రామయ్య యాదవ సోదరులు సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

tags : shanampudi, gangamma temple, HNR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *