ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా సోమవారం ఖైరతాబాద్‌లో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి కొలువుదీరాడు. 61 అడుగుల ఎత్తు, 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలతో ఏర్పాటు చేసిన మహాగణపతిని గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తొలి పూజ చేశారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూడా ఖైరతాబాద్ గణనాథుడిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ దేశ సమగ్రతకు, సంస్కృతికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని గణపతిని వేడుకున్నట్లు చెప్పారు. మొదటి సారి రాజ్యాంగ పదవిని చేపట్టడానికి ముందు గణపతిని అంతా మంచి జరిగేలా చూడాలని వేడుకున్నానన్నారు. ఈనెల 5 వ తేదీన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకుంటామన్నారు. ఈ సందర్బంగా వినాయకుడి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 48 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిఘా పెట్టారు.

 

 

 

tags : khairathabad, mahaganapathi, governor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *