క‌ర్నూలులో సైరా భారీ ఈవెంట్‌కి ప్లాన్ ?

అక్షిత ప్రతినిధి: తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరా. అక్టోబ‌ర్ 2న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల చేసి అంచ‌నాలు పెంచిన చిత్ర బృందం, సెప్టెంబ‌ర్ 15న ట్రైల‌ర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక సెప్టెంబ‌ర్ 21న క‌ర్నూలులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌పాల‌ని టీం యోచిస్తుంద‌ట‌. అందుకు కార‌ణం ఉయ్యాల‌వాడ క‌ర్నూలు ప్రాంతానికి చెందిన వాడు కావ‌డ‌మే. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. హైద‌రాబాద్‌, చెన్నై, వైజాగ్, ముంబై, బెంగ‌ళూర్ ప్రాంతాల‌లో కూడా చిత్రానికి సంబంధించి ప‌లు ఈవెంట్స్ నిర్వ‌హించనున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం సైరా చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. చిరంజీవి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తి బాబు, అమితాబ్ బ‌చ్చ‌న్, నిహారిక, సుదీప్ ,విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాప పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *