క్రిస్టియన్లకు ప్రాధాన్యత మరవలేనిది

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌ రావు క్రిస్టియ‌న్ల‌ పట్ల చూపిస్తున్న ఆదరణ అమోఘమని మైనార్టీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ లూకా అన్నారు. క్రిస్టమస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన ముఖ్యమంత్రిని ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిగా సీఎం సైతం లూకాకు క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ సీఎంను ఉద్దేశించి.. మీరు క్రిస్టియన్లకు ఇస్తున్న ప్రాధాన్యత మరవలేనిదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా క్రిస్మస్‌ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని మైనార్టీలైన క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు మొదలగు వారికి తగిన ప్రాధాన్యతనిచ్చి, వారికి అన్ని విధాల చేయూతనిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. ఈ సందర్భంలో ఎమ్మెల్సీ డి. రాజేశ్వర రావు కూడా సీఎంకు పుష్పగుచ్చం ఇచ్చి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

tags : cm kcr, mlc rajeswar Rao, Pragathibhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *