కోవిడ్ వైద్యసేవలకై నియామకాలు

ప్రాంతీయ వైద్యశాలల్లో 3 నెలలకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో స్టాఫ్ నర్సుల నియామకంకు దరఖాస్తులు ఆహ్వానం

డిసిహెచ్ డా. మాతృ

నల్గొండ, అక్షిత ప్రతినిధి : తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ,నకిరేకల్ ప్రాంతీయ వైద్య శాలల్లో కోవిడ్ వైద్య సేవలు కొరకు 3 నెలల పాటు పనిచేయడానికి అవుట్ సోర్సింగ్ పద్దతిలో స్టాప్ నర్స్ లు (10) పోస్టుల నియామకంకు అర్హత అనుభవం గల అభ్యర్థులు ఏప్రిల్  29 లోగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి,నల్గొండ ఆవరణలో ఉన్న జిల్లా వైద్య శాలల పర్యవేక్షణ అధికారి కార్యాలయం(సదరం ఆఫీస్ పై అంతస్తు) లో దరఖాస్తు చేసుకోవాలని డి.సి.హెచ్ ఎస్.డా. మాతృ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 30 న దరఖాస్తులు పరిశీలించి మెరిట్ అభ్యర్థుల జాబితా మే 1న నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించనున్నట్లు ఆయన ఈ ప్రకటన లో పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *