సీఎం కేసీఆర్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :ఏసు క్రీస్తు సిలువ వేయబడిన రోజు జ్ఞాపకార్థం క్రైస్తవ సోదరులు పాటించే “గుడ్ ఫ్రైడే” సందర్భంగా.. జీసస్ బోధనలలోని మానవీయ తత్వాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ పున:శ్చరణ చేసుకోవాలని సిఎం కోరారు.
” కరుణామయుడైన క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి సహనం, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళి అనుసరించ దగ్గవి ’’ అని సిఎం అన్నారు.
కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గుడ్ ప్రైడే ప్రార్ధనలు జరుపుకోవాలని క్రైస్తవ సోదరులను సిఎం కోరారు.