కోవాగ్జిన్ కు డబ్ల్యు హెచ్ ఓ లిస్ట్ లో దక్కని చోటు

కోవాగ్జిన్ వేసుకుంటే… అమెరికా,బ్రిటన్ లో నో ఎంట్రీ…!
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

దేశంలో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో…. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ కు కొత్త సమస్య వచ్చింది. తాజాగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర యూజ్ లిస్టింగ్ లో కోవాగ్జిన్ కు చోటు దక్కలేదు. కాగా… డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి ఉన్న టీకాలు వేసుకున్న వారినే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని అమెరికా, బ్రిటన్ దేశాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిని అనుమతించబోమని ఆ దేశాలు వెల్లడించాయి. దీంతో, భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ ను తీసుకోవడానికి చాలా మంది సందేహిస్తున్నారు. అటు తమ టీకా… అమెరికా, యూకే లోని వైరస్ ను సమర్థవంతంగా ఎదురుర్కుంటుందని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. అయితే… కోవాగ్జిన్ కు (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర యూజ్ లిస్టింగ్ లో చోటు దక్కక పోవడం ఆందోళకర అంశమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *