కోదాడ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా నిర్మిస్తాం
కోదాడ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ మారుస్తాం
కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
కోదాడ, అక్షిత ప్రతినిధి :
కోదాడ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్న కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ప్రజల కోసం ప్రగతి కోసం కార్యక్రమాన్ని 1 వ మరియు 2 వ వార్డులో నిర్వహిస్తూ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ….. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తుందని అన్నారు. కులమతాలతో సంబంధం లేకుండా ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష నూటపదహార్లు కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాల ద్వారా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ అన్నారు .200 ఉన్న పింఛను 2016 లు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు .24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కోదాడ పట్టణంలో 560 డబల్ బెడ్రూమ్ ఇల్లును అర్హులైన పేదలకు త్వరలో అందిస్తామన్నారు. కోదాడ పట్టణంలో సుదీర్ఘకాలంగా ఉన్న సమస్య 33 కెవి లైన్ మారుస్తున్న మన్నారు. కోదాడ పట్టణంలో పెద్ద చెరువును మినీ ట్యాంకుబండ్ గా నిర్మిస్తామన్నారు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ద్వారా అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని అన్నారు . మార్చి 14న జరిగే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి ప్రదర్శన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ పద్మ మధుసూదన్ ,పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు ,జిల్లా నాయకులు అల్తాఫ్ హుస్సేన్ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ ,కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.