కొరియన్ ఓపెన్ నుంచి కశ్యప్ అవుట్

ఇంచియాన్ (సౌత్ కొరియా): కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ అవుటయ్యాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో జపాన్‌కు చెందిన కెంటో మొమొటా చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. నంబర్ వన్ ర్యాంకర్ అయిన మొమొటో 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో కశ్యప్‌ను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన జాన్ ఒ జార్గెన్‌సెన్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకున్న కశ్యప్ పతకంపై ఆశలు రేపాడు. అయితే, సెమీస్‌లో మొమొటా బలమైన షాట్ల ఎదుట నిలవలేకపోయాడు. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో చైనీస్ తైపీ చౌ తియెన్ చెన్‌తో మొమొటా తలపడనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *