కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలు కేటాయించారు. కొందరు మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు కూడా చేశారు. ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరుగురు కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. హరీశ్ రావుకు కీలకమైన ఆర్థికశాఖను కేటాయించగా.. కేటీఆర్‌కు ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన, ప్రణాళిక, శాంతి భద్రతలు, నీటిపారుదల, రెవెన్యూ, మైనింగ్, ఇతరులకు కేటాయించని శాఖలు సీఎం కేసీఆర్ దగ్గరే ఉన్నాయి.

హరీశ్‌ రావు-ఆర్థికశాఖ
కేటీఆర్– ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖలు
సబితా ఇంద్రారెడ్డి -విద్యాశాఖ
పువ్వాడ అజయ్‌కుమార్ -రవాణాశాఖ
గంగుల కమలాకర్ – బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలు
సత్యవతి రాథోడ్ -గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖలు
జగదీష్‌రెడ్డి – విద్యుత్ శాఖ

 

 

 

 

tags : new cabinet, telangana,cm kcr, governor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *