కొండాపూర్ ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్

ఎంపీ రంజిత్ రెడ్డి చొరవతో కొండాపూర్ ఆస్పత్రికి

కోటితో ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

యావత్ దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న వేళ చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. ఆయన ప్రత్యేక చొరవతో కొండాపూర్ ఆస్పత్రికి కోటి రూపాయల విలువగల ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు అయింది. కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా రోగుల కోసం అత్యవసరంగా కావాలసిన సదుపాయాలను మొదటి నుంచి సముకూరుస్తున్నారు. ప్రతి రోజు చేవెళ్ల లోక్ సభ పరిధిలోని కరోనా వైరస్ రోగుల వివరాలను, అందుతున్న వైద్య సేవలను తెలుసుకుంటూ, కరోనా వైరస్ కట్టడికి కావాల్సిన తక్షణ చర్యలను గూర్చి అధికారులతో సమీక్షలు జరుపుతూ, ఎప్పటికప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి వాకబు చేస్తున్నారు. ఆ చర్యలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం, ప్రత్యేకంగా కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్ నిర్మాణం కోసం, ఎంపీ రంజిత్ రెడ్డి భారత రక్షణ శాఖ సారథ్యంలో నడిచే భారత్ డైనమిక్స్ లిమిటెడ్( బీడీఎల్) ఉన్నతాధికారులకు రంజీత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేకంగా లేఖ రాశారు. లేఖ రాయడంతో పాటు పలుమార్లు బీడీఎల్ అధికారులకు ఫోన్ చేసి ఫాలో అప్ చేయడంతో ఎట్టకేలకు ఆయన ప్రత్యేక చొరవతో ఆక్సిజన్ ప్లాంట్ కొండాపూర్ ఆస్పత్రిలో త్వరలో ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారుల నుండి హామీ కూడా లభించిందని ఎంపీ కార్యాలయం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *