కొండంత బలాన్ని ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు: జూనియర్ ఎన్టీఆర్

  • ఈ సినిమాపై చూపిస్తున్న ఆదరణ మర్చిపోలేను
  • దృఢ సంకల్పంతో త్రివిక్రమ్ పని చేశారు
  • త్రివిక్రమ్ లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు

విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఇలాంటి సమయంలో తనకు అండగా నిలిచిన, కొండంత బలాన్ని ఇచ్చిన అభిమానులకు తన ధన్యవాదాలని చెప్పారు. అదేవిధంగా, చిత్రయూనిట్ కు, మీడియాకు కూడా తన థ్యాంక్స్ తెలియజేశారు. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణను మర్చిపోలేనని, దృఢ సంకల్పంతో పని చేసిన త్రివిక్రమ్ లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *