అక్షిత బ్యూరో, సూర్యాపేట : సంతోషిమాత ఆలయ ప్రాంగణంలో చీరెలు నేసిఅమ్మవారికి అర్పించడంగొప్పవరమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సంతోషి మాత ఆలయంలో మగ్గం నేసి అమ్మవారి చీరెల తయారీని ఆయన ప్రారంభించారు. చేనేత రంగాన్ని గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కోన్నారు.ఉద్యమ సమయంలో నే భూదాన్ పోచంపల్లి, సిరిసిల్లలో పర్యటించిన నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికులను ఆదుకునే విదంగా ప్రణాళికలు రూపొందించారని ఆయన తెలిపారు .సూర్యపేట లోని సంతోషిమాత ఆలయం లో ఈ నెల 30 నుండి జరుగు దేవి నవరాత్రోత్సవాలలో అమ్మ వారిని అలంకరించేందుకు గాను అవసరమయ్యే చీరలను ఆలయ ప్రాంగణంలో నే నేసి అలంకరించాలని పద్మశాలి సంఘం నిర్ణయించారు.అందుకు అవసరమైన మగ్గాన్ని పట్టణానికి చెందిన న్యాయవాది పిశికే వీరయ్య సమకూర్చారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి చీరను నేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
దేవి నవరాత్రోత్సవాలలో అమ్మవారి అలంకరణ కు గాను ముందుకు వచ్చిన నిర్వాహకులను ఆయన అభినందించారు.
tags : chenetha, minister jagadeeshreddy, srpt