కేసీఆర్ తోనే…గ్రామీణ వ్యవస్థలకు లాభం : మంత్రి గుంటకండ్ల

అక్షిత బ్యూరో, సూర్యాపేట : సమీకృత మత్స్య అభివృద్ధిలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్ పహాడ్ మండలంలోని అన్నారం చెరువులో ఆదివారం సబ్సిడీ చేప పిల్లలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెరువులో వదిలారు. ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత 60యేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణప్రాంతంలోని కుల వృత్తులు దగాకు గురైనాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలపై గత పాలకులు చిన్న చూపు కారణంగా గ్రామీణ వికాసం మరుగున పడిందని అన్నారు. చితికి పోయిన గ్రామీణ కుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల ద్వారా గ్రామీణ వ్యవస్థలకు లాభం చేకూరిందని అన్నారు. కుల వృత్తులకు ప్రోత్సాహకం అందించడంలో భాగంగానే మత్స్య కార్మికుల కోసం 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను అందిస్తున్నామని ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 561  చెరువులలో  3 కోట్ల  65  లక్షల  చేప పిల్లలను  పంపిణీ  చేయబోతున్నామని ఆయన తెలిపారు. ప్రతీ  చెరువులో 40 శాతం చేప పిల్లలను పెంచడానికి  చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ  కార్యక్రమంలో కలెక్టర్ అమయ్ కుమార్, యంపీపి నెమ్మాది బిక్షం, జడ్పీటీసీ అనితా, మండాది నాగెష్, మత్స్య శాఖ అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

tags : fisheries development, penpahad, tanks, jagadeeshreddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *