కేసీఆర్ కోలుకోవాలని పూజలు

సీఎం కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు

హైద‌రాబాద్, అక్షిత ప్రతినిధి : క‌రోనా బారిన ప‌డిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, ఆల‌యాల అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామి ఆల‌యంలో అర్చ‌కులు, ఆల‌య సిబ్బంది క‌లిసి సుద‌ర్శ‌న హోమం నిర్వ‌హించారు. ఏడు పాయ‌ల వ‌న దుర్గాభ‌వాని మాతా ఆల‌యంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే రవిశంకర్, మల్యాల, కోడీమ్యాల మండల నాయకులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. చిలుకూరు బాలాజీ ఆల‌యంలోనూ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. బషీర్ బాగ్ కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వ‌హించారు. ఈ హోమంలో స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాఘవ, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *