కేటీఆర్ మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు.. హుజూర్ నగర్ ను అభివృద్ధి చేసింది నేనే.. ఇకపై చేసేది కూడా నేనే

కేటీఆర్ మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు

హుజూర్ నగర్ ను అభివృద్ధి చేసింది నేనే.. ఇకపై చేసేది కూడా నేనే

హుజూర్ నగర్ ను స్మార్ట్  సిటీ గా మారుస్తా

రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి అదే నిజమనుకుని బొక్క బోర్లా పడ్డ

కేటీఆర్: టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్: కేటీఆర్ హుజూర్ నగర్ రోడ్షో లో మాట్లాడిన విషయాలన్నీ పచ్చి అబద్దాలని ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం కూడా లేదని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ

అరచకానికి, అభివృద్ధికి మధ్య ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

హుజూర్ నగర్  వెనుకబాటు తనానికి ఉత్తమ్ కారణం అన్న  బ్రదర్ కేటీఆర్  నీకు అవగాహన లోపం ఉందని అన్నారు. స్థానిక విషయాలు  ఏమి తెలియకుండానే ఎలా మాట్లాడాడో కేటీఆర్ చెప్పాలని సమాధానం చెప్పాలని అన్నారు.

బ్రదర్ కేటీఆర్ నీకు స్క్రిప్ట్ రాసిన వాళ్ళు  పనికిరాని వాళ్ళు అని తేలిపోయిందని అది నువ్వు చదివిన స్క్రిప్ట్ ను బట్టే తెలిసిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

భారత దేశ చరిత్ర లో ఇప్పటి వరకు ఎక్కడ లేని అభివృద్ధి హుజూర్ నగర్ లో జరిగిందని అదీ కాంగ్రెస్ తోనే జరిగిందని ఆయన అన్నారు.

మీ పార్టీ అభ్యర్థి ఊళ్ళో కూడా నేనే అభివృద్ధి చేశానని ఆయన గుర్తు చేశారు.

మీ పార్టీ నాయకులు కేవలం పోలీస్ స్టేషన్ లు అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని అన్నారు.ఇసుక దందా,మట్టి దందా,భూ మాఫియా లకు పాల్పడుతూ అమాయక గిరిజనులు,రైతులు,కాంగ్రేస్ నాయకుల పై తప్పుడు కేసులు పెట్టి  జైళ్లలో పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2014 నుండి రాష్ట్రం లో ఎక్కడ మీరు అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు.

మీ అసమర్ధత,చేతగాని తనం వలన మిషన్ భగీరధ పనులు తో అద్భుతంగా ఉన్న సిమెంట్ రోడ్లన్ని  ద్వంసం అయ్యాయని ఆయన తెలిపారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఊళ్ళో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఒక వేళ వస్తే చూపించాలని ఆయన ప్రశ్నించారు.

తెరాస ప్రభుత్వం లో అమూల్యమైన ప్రజల సొమ్ము దోపిడీకి గురిఅవుతుందని ఆయన అన్నారు.

4 వేల ఇండ్ల గురించి శాసనసభ లో అడిగిన నాటి జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్,జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి లకు పలుమార్లు దృష్టికి తీసుకొని వచ్చిన ఫలితం లేకుండా పోయిందిని ఆయన అన్నారు.

మంత్రి జగేదేశ్వర్ రెడ్డి,తెరాస నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

మీరు నిర్వహించిన రోడ్ షో కు రోడ్డు వేయించింది కూడా నేనే అని ఆయన అన్నారు.

హుజూర్ నగర్ లో ఉన్న ప్రభుత్వం కార్యాలయాలు అన్ని నేను కట్టించినవే అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చి హుజూర్ నగర్ ను స్నార్ట్ సిటీ గా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఎం.ఎల్.ఏ గా పద్మావతి గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

ఒక్క ఓటు వేస్తే నేను ఎంపీగా ఉన్నా కూడా ఇద్దరం ఎమ్మెల్యేలు గా లు పని చేస్తామని అన్నారు.

పాలకీడు మండలం లో కాల్వ చివరి భూములు లకు 20 వేల ఏకరాలకు కొత్త లిప్ట్ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం చొరవతో జగ్గయ్యపేట నుండి మిర్యాలగూడ వరకు పాసింజర్ రైలు నడిపిస్తానని హామీ ఇచ్చారు.

హజూర్ నగర్ నియోజక వర్గం లో  ఈఎస్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తానని హామీ ఇచ్చారు..

మిర్యాలగూడ నుండి కోదాడ వరకు రోడ్డు నిర్మాణం పనులు వేగవంతం చేయిస్తానని అన్నారు.

నిరుద్యోగ యువకుల కోసం ప్రేత్యేక శ్రద్ధ వహిస్తానని అన్నారు.  ప్రభుత్వాల పై ఒత్తిడి తెస్తానని అన్నారు.ఈ ఉప ఎన్నికల్లో పద్మావతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు యరగాని నాగన్న, తన్నీరు మల్లిఖార్జున్,మహేష్, యోహాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *