కేటీఆర్ ఓ రాజకీయ బచ్చా.. : టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి

కేటీఆర్ ఓ రాజకీయ బచ్చా నన్ను ఏక వచనంతో పిలిచే అర్హత ఆయనకు లేదు

పోలీసులను అడ్డుపెట్టుకొని తెరాస గలీజు రాజకీయాలు చేస్తుంది: టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్: కేటీఆర్ ఓ బచ్చా అని తనను ఏకవచనం తో పిలిసే అర్హత ఆయనకు లేదని టీపీసీసీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ పై ఘాటుగా స్పందించారు.హుజూర్ నగర్ శాసన నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల సందర్బంగా ఆయన గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

హుజూర్ నగర్ లో జరిగే ఉప ఎన్నిక రాష్ట్ర చరిత్రను మలుపు ను తిప్పబోతుందని అన్నారు.

తెరాస నాయకులు  పోలీస్ లను అడ్డుపెట్టుకొని గలీజు రాజకీయాలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా స్పందించారు.

రాష్ట్ర ,దేశ స్థాయిలో జర్నలిస్ట్ ల  సమస్యల పై పోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అవినీతి,అరాచకానికి, అధర్మానికి ,ధర్మం న్యాయానికి మధ్య పోరాటం జరుగుతుందని అన్నారు..

నియోజక వర్గం లో కాంగ్రేస్ నాయకుల పై తెరాస నాయకులు తప్పుడు కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని, డబ్బులు తో కాంగ్రేస్ నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు.

కేటీఆర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

కేటీఆర్ ను ఉద్దేశించి కేటీఆర్ మీ అయ్య ఇచ్చిన పదవులతో  విర్ర వీగకు నోరు అదుపులో పెట్టుకో అని మాట్లాడు అని

మీ లాగా కుటుంబ,కుల ,గలీజు రాజకీయాలు చేయలేదని ఆయన అన్నారు.

మిషన్ భగీరథ లో ఎన్ని కోట్లు దోచుకున్నావో ప్రజలకు చెపాలని ఆయన ప్రశ్నించారు.

మేము చచ్చే వరకు నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తామని అన్నారు.

హుజూర్ నగర్ టికెట్ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం యామారం కు చెందిన ఆంధ్ర వ్యక్తికి ఎలా ఇచ్చావని ప్రశ్నించారు.

హజూర్ నగర్ లో ఆరు ఏండ్ల లో తెరాస ప్రభుత్వం ఏం చేసిందని ఎద్దేవా చేశారు.

కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాన్ని వ్యభిచారం చేస్తున్నాడని అన్నారు.

చంద్రబాబు తన్ని వెల్లగొట్టితే  మా సొంత డబ్బుల తో కాంగ్రెస్ నుండి రెండు సార్లు ఎంపి గా గెలిపించుకున్నామని అన్నారు.

కౌన్సిల్ చైర్మన్  దిగజారిన రాజకీయాలు చేస్తుంన్నాడని అన్నారు.ఆధారాలతో  గౌవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

స్థానిక పోలీసులు పై నమ్మకం లేదని కేంద్ర బలగాలను రప్పించాలని ఆయన కోరారు.

కేటీఆర్ అంకుల్ నాపై కేసు పెడితే  కోర్టు కొట్టివేసిందని ఎద్దేవా చేశారు.ఈ బచ్చ మాట్లాడుతాడా అని అన్నారు.

వయసు, పదవికి గౌరవం ఇవ్వాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *