కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

అక్షిత ప్రతినిధి,  ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం దీపావళి కానుకగా తీపి కబురు చెప్పింది. 5 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది జూలై నుంచి పెంచిన డీఏని వర్తింపజేస్తారు. 12 శాతం డీఏను 17 శాతానికి పెంచేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపుతో 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందువల్ల ప్రభుత్వ ఖాజానాపై రూ.16,000 లక్షల అదనపు భారం పడుతుంది. కాగా, ఆశా వర్కర్లకు ఇచ్చే వేతనాన్ని రెట్టింపు….అంటే రూ.1000 నుంచి రూ.2000కు పెంచినట్టు కూడా జవదేకర్ ప్రకటించారు.

 

tags : central Govt employees, DA, delhi, javadekar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *