కిలో చింతకాయలు రూ. వెయ్యి

అక్షిత ప్రతినిధి, సంగారెడ్డి :  వినాయకచవితి పండుగవేళ చింతకాయల ధరలు ఆకాశాన్నంటాయి. 50 గ్రాముల చింతకాయల ధర  రూ. 50లు. కిలో చింతకాయలు రూ. వెయ్యి పలుకుతోంది. గత ఏడాది కన్న మూడు రెట్లు పెరగడంతో కొనుగోలుదారులు మండిపడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఎక్కడా చింతచెట్లకు పూతరాలేదని.. దీంతో హైదరాబాద్ నుంచి చింతకాయలను తీసుకువచ్చి అమ్ముతున్నామని వ్యాపారులు చెప్పారు. పండగకు చింతకాయ వాడటం తప్పనిసరికావడంతో ఎక్కువ ధర అయినా కొనక తప్పడంలేదని కొనుగోలు దారులు అంటున్నారు.

 

 

tags : chinthakaya, sangareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *