కార్మికుల పక్షపాతి… సీఎం కేసీఆర్

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : గుత్తా, భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎఫ్సీఐలోని హమాలీ వర్కర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన ధనావత్ భిక్కు నాయక్ ప్యానెల్ ను అభినందించారు. కార్మిక సంఘాల్లోనూ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్న భిక్కు నాయక్, ఇతర ప్యానెల్ సభ్యులను గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు ఈ సందర్భంగా అభినందించారు. కార్మిక సంఘాల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రవీందర్ నాయక్, ఏడుకొండలు,తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *