ఖమ్మంలో కార్టున్ ఎగ్జిబిషన్
అక్షిత/ఖమ్మం బ్యూరో :
ఖమ్మం జిల్లా ట్రెజరి డిప్యూటి డైరెక్టర్ వెంటపల్లి సత్యనారయణ కోవిడ్ -19 అంశం పై గీసిన కార్టున్ కి అంతర్జాతీయ స్థాయిలో ఏంపికై అవార్డు అందుకున్నారు. ఆయన గీసీన కార్టున్ల ఎగ్జిబిషన్ ఆదివారం ఖజానా శాఖ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంబించారు.అధ్బుతమైన కార్టున్లని తిలకించారు. ఈ సందర్బంగా డిడి సత్యనాయణ ని అభినందించి జిల్లా కలేక్టర్ కర్ణన్ ప్రియాంక( జడ్పీ సిఈవో) దంపతులు శాలువలతో సన్మానించారు.అనంతరం కలెక్టర్ కి శాలువ మెమొంట్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విధ్యాశాఖాధికారి పి మధన్ మోహన్ ముఖ్య ప్రణాళికాదికారి కొండపల్లి శ్రీరామ్ టీయన్జీవో జిల్లా అధ్యక్షుడు పొట్టపింజర రామయ్య గెజిటెడ్ ఉధ్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆళ్ళ శ్రీనివాసరెడ్డి ఖాజానా శాఖ ఉధ్యోగులు దుర్గా ప్రసాద్ మోదుగు వేలాద్రి యన్ వి కృష్ణారావులు డిడి సత్యనారయణ ని ఘనంగా సన్మానించారు.