కాంగ్రెస్ మునిగిపోయే నావ.. కాంగ్రెస్ కు ఓటేస్తే సంక్షోభం!

కాంగ్రెస్ మునిగిపోయే నావ

కాంగ్రెస్ కు ఓటేస్తే సంక్షోభం

టీఆర్ ఎస్ కు ఓటేస్తే సంక్షేమం

సైదిరెడ్డి ని ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాం

ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టె పేలం సర్దుకోవడమే

దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉన్న ఉత్తమ్ చేసిన అభివృద్ధి శూన్యం: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, కాంగ్రెస్ పార్టీ కి ఓటేస్తే సంక్షోభం ఏర్పడినట్లే అని ఐటి,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాత్రి హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్బంగా తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హుజూర్ నగర్ ప్రజలు చైతన్యవంతులని అన్నారు. చైతన్యవంతులైన మీరు ఈ సారి తెరాస అభ్యర్థి శానంపుడి సైడైరెడ్డికి ఓటేసి అభివృద్ధికి దోహదపడాలన్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉండి హుజూర్ నగర్ సమస్యల పై గాని అభివృద్ధికి గాని ఒక్కసారి కూడా రాష్ట్ర మంత్రిని అడిగిన దాఖలాలు లేవని అన్నారు. 2018ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతానని  మాయమాటలు చెప్పి గెలిచాడని అన్నారు. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే కేంద్రమంత్రి అవుతానని చెప్పి మళ్ళీ ప్రజల్ని మోసం చేసి గెలిచాడన్నారు. ఎన్నికలప్పుడు రంగులు మార్చే ఊసర వెల్లిలా మారే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఇక్కడి నుండి సాగనంపాలని కోరారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చుచేసిందని అన్నారు.194 కోట్ల రూపాయలను హుజూర్ నగర్ రైతన్నల కోసం రైతు బంధు రూపంలో సహాయం అందించిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని అన్నారు. అనుకోకుండా రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశ్యంతో రైతు భీమా పథకం పెట్టిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని అన్నారు. రైతు భీమా ద్వారా హుజూర్ నగర్ నియోజకవర్గ రైతుల కుటుంబాలకు  20 కోట్ల 4 లక్షల రూపాయలను ఇచ్చిందని ఆయన అన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 6083 మంది లబ్ధిదారులకు 33 కోట్ల 40లక్షల రూపాయల సహాయాన్ని అందించిందని ఆయన అన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ఒక్క హుజూర్ నగర్ నియోజకవర్గానికి 4.8 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అన్నారు.112కోట్ల72 లక్షల రూపాయలను ఈ ప్రాంత ప్రజల తాగు నీటి సమస్యను తీర్చడం కోసం మిషన్ భగీరద రూపంలో ఖర్చు చేసిందని ఆయన అన్నారు. ఇంకా హుజూర్ నగర్ అభివృద్ధి చెందాలంటే తెరాస అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఉప ఎన్నికల ఇంచార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల నర్సింహ్మయ్య,  ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, కాసోజు శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *