కాంగ్రెస్‌ లక్ష్యం రాజకీయాలే.. మాది దేశభక్తి: అమిత్ షా

అక్షిత ప్రతినిధి, ముంబై: ‘‘కశ్మీర్ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయాలు చేయడానికి వాడుకుంటోంది. కానీ, మేము జాతీయవాదంతో చూస్తున్నాము’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ దమ్మూ-ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రెండోసారి మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే ఆయన తొలగించారు. మా కుటుంబంలోని మూడు తరాలు దీనికోసం (ఆర్టికల్ 370 రద్దు) పోరాడాయాని రాహుల్ గాంధీ అంటారు. కానీ, చేయలేకపోయారు. ఎందుకంటే వారికది కేవలం రాజకీయ సమస్య. మాకు మాత్రమే జాతీయ సమస్య’’ అని అమిత్ షా అన్నారు.

‘‘దేశంలోని ప్రతి వ్యక్తి కశ్మీర్‌ను అంతర్గత సమస్యగానే చూశారు. అయితే దానికి అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను తొలగించిన అనంతరం.. ప్రతి భారతీయుడు కశ్మీర్ నాది అని గర్వంగా చెప్పుకుంటున్నాడు’’ అని ఆయన ఉద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *