కల్కి భగవాన్ ఐటీ పాట 500 కోట్లు

ఆశ్రమాలు, వ్యాపారసంస్థల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు 

-బయటపడ్డ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వజ్రాలు

దక్షిణాది రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లోని కల్కి ఆశ్రమాలు, నివాసాలు, వ్యాపార సంస్థలపై ఐటీ సోదాల్లో అధికారులు భారీగా స్వదేశీ, విదేశీ కరెన్సీని, కిలోలకొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ.93 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఇందులో రూ.43.9 కోట్ల స్వదేశీ కరెన్సీ ఉన్నట్టు చెప్పారు. విదేశీ కరెన్సీలో అత్యధికంగా రూ.18 కోట్లు విలువ చేసే 25 లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయన్నారు. వీటితోపాటు 88 కిలోల బంగారం (విలువ రూ.26 కోట్లు), 1271 క్యారట్ల వజ్రాలను (విలువ రూ.5 కోట్లు) స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

అక్షిత ప్రతినిధి, బెంగళూరు/హైదరాబాద్/చిత్తూరు: కల్కిభగవాన్, అమ్మ భగవాన్ పేరుతో చెలామణి అయిన విజయ్‌కుమార్ దంపతుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లోని కల్కి ఆశ్రమాలు, నివాసాలు, వ్యాపార సంస్థలపై ఆదాయం పన్ను (ఐటీ) అధికారుల దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. లోతుగా దర్యాప్తు చేస్తున్నకొద్దీ కల్కి దంపతుల అక్రమాల పుట్ట పగులుతున్నది. ఈ దంపతులు రూ.500 కోట్లకు పైగా అక్రమాస్తులను కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. మూడు రోజుల సోదాల్లో రూ.93 కోట్ల మేర సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. 

నగదు కట్టలు.. కిలోల కొద్దీ బంగారం

ఐటీ సోదాల్లో అధికారులు భారీగా స్వదేశీ, విదేశీ కరెన్సీని, కిలోలకొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ.93 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఇందులో రూ.43.9 కోట్ల స్వదేశీ కరెన్సీ ఉన్నట్టు చెప్పారు. విదేశీ కరెన్సీలో అత్యధికంగా రూ.18 కోట్లు విలువ చేసే 25 లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయన్నారు. వీటితోపాటు 88 కిలోల బంగారం (విలువ రూ.26 కోట్లు), 1271 కేరట్ల వజ్రాలను (విలువ రూ.5 కోట్లు) స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీటితోపాటు రూ.409 కోట్ల మేర అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించామన్నారు. వీటికి సంబంధించిన పలు కీలక పత్రాలను, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఐటీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతడు (కల్కి) 1980ల్లో వన్నెస్ పేరుతో ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఆటలు ఇలా అనేక రంగాలకు విస్తరించారు. దేశ, విదేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించారు. సంస్థకు చెందిన ట్రస్టుల్లో తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత వంటి వెల్‌నెస్ కోర్సులను, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. వీటిద్వారా దేశ, విదేశాలకు చెందిన వ్యక్తులను ఆకర్షించారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చినవారి ద్వారా భారీగా విదేశీ కరెన్సీని సంపాదించారు. ఈ డబ్బును ఏపీ, తమిళనాడుతోపాటు పలు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టారు. ఐటీ సోదాల నేపథ్యంలో వీటికి సంబంధించిన పత్రాలను ట్రస్టు సభ్యులు ధ్వంసం చేస్తున్నట్టు మాకు సమాచారం ఉన్నది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లోని ఆశ్రమాల్లో వివిధ రూపాల్లో భారీగా విరాళాలను స్వీకరిస్తున్నారని, ఆ డబ్బును లెక్కల్లో చూపకుండా దాచేస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతోపాటు రియల్ ఎస్టేట్‌లో వచ్చిన డబ్బును కూడా నల్లధనంగా మార్చుతున్నట్టు తేలిందన్నారు. మొత్తంగా రూ.500 కోట్లకుపైగా అక్రమాస్తులను గుర్తించామని చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, చిత్తూరు తదితర 40 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు వివరించారు.

విదేశీ కరెన్సీ దారి మళ్లింపు

కల్కి కుటుంబం దేశ, విదేశాల్లోని అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని ఐటీ అధికారులు తెలిపారు. అమెరికా, చైనా, సింగపూర్, దుబాయ్ దేశాల్లో ఉన్న కంపెనీల్లోనూ వీరికి వాటాలు ఉన్నట్టు వెల్లడించారు. వెల్‌నెస్ కోర్సులకు హాజరయ్యే విదేశీ క్లయింట్ల నుంచి ఫీజులు, విరాళాల రూపంలో వచ్చిన డబ్బును హవాలా మార్గంలో ఈ కంపెనీల్లోకి మళ్లించినట్టు గుర్తించామన్నారు. ట్రస్టుకు చెందిన ఓ వ్యక్తి కమీషన్ తీసుకొని మొత్తం డబ్బును అధికారుల కండ్లుగప్పి వివిధ మార్గాల్లో విదేశాలకు తరలించినట్టు అనుమానిస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *