కరోనా వైద్యానికి… కదిలే బస్సులు

మిర్యాల”లోనూ లార్డ్స్ చర్చి బస్సులు
పేదలకు మెరుగైన క్రిటికల్ కేర్ వైద్యం

డా రాజ్ ప్రకాష్ పాల్ సేవానిరతికి ప్రశంస

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ప్రపంచాన్ని అట్టుడికిస్తున్న కరోనా చికిత్సకు కదిలే బస్సులొచ్చాయి. ఆసుపత్రికి చేరకుండానే ప్రాణాలు గాల్లో కలుస్తున్న తరుణం ఓ వైపు… వైద్యానికి కార్పొ”రేట్” లక్షలు దండుకుంటున్న పరిస్థితులు మరో వైపు ఉండడంతో పేదలకు క్రిటికల్ కేర్ వైద్యమందించేoదుకు హైదరాబాద్ లార్డ్స్ చర్చి ..వెరా స్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో 66 బస్సులు రూపుదిద్దుకున్నాయి. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించేందుకు గాను లార్డ్స్ చర్చి దైవజనులు డాక్టర్ రాజ్ ప్రకాష్ పాల్, జెస్సీ పాల్ లు నిండు మనస్సుతో క్రిటికల్ కేర్ వైద్యం అందుబాటులో కి తెచ్చేందుకు వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టి కదిలే బస్సులను సిద్దం చేశారు. ఆయా బస్సులోనే ఆక్సిజన్, ఐసియూ కార్పోరేట్ సకల సదుపాయాలతో అత్యంత ఖర్చైనప్పటికి పేదల వద్దకు వెళ్ళి చికిత్స అందించేందుకు సంసిద్దమైంది. మెడికల్ యూనిట్ బస్సులో వైద్య సేవలకై ఒక ల్యాబ్, డాక్టర్, ఇద్దరు నర్సులతో పాటు 9 బెడ్లను సిద్దం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాకు రెండు బస్సుల చొప్పున సిద్దం చేయనుండగా ఇప్పటికే 33 బస్సులను సిద్దం చేయగా వారం రోజుల క్రితం రాష్ట్ర ఐటి, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర పశు సంవర్దక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, లార్డ్స్ చర్చి దైవ జనులు డాక్టర్ రాజ్ ప్రకాష్ పాల్, జెస్సీ పాల్ లు ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే కదిలే బస్సుల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు కేటాయించిన బస్సులకు గాను మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ లు ప్రారంభించగా మరోబస్సును గురువారం మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ స్టేడియంలోమిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. తొలుత విజన్ మిర్యాలగూడ చైర్మన్, నజరేతు ప్రార్థన మందిరం దైవజనులు రెవ.డాక్టర్ కిరణ్ కుమార్ సౌపాటి ప్రార్థించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ పేదలకు మెరుగైన క్రిటికల్ కేర్ వైద్యమందించేoదుకు కదిలే బస్సు మిర్యాలగూడకు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిపి నూకల సరళహనుమంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రా విష్ణు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టి బాబునాయక్, మజ్జా రామకృష్ణ, మోసిస్ అలీ, వీరకోటిరెడ్డి, పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసి బాల సత్యనారాయణ, జడ్పీటిసి అంగోతు హతిరం నాయక్, కౌన్సిలర్ లు నవాబ్, సలీం, ఐలవెంకన్న, అమృతం సత్యం, నాయకులు అశోక్, నాగార్జున చారి,లక్ష్మీనారాయణ, జానకి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ చికిత్సకై… కదిలే బస్సు

కోవిడ్ పేషేంట్స్ ఎవరైనా క్రిటికల్ గా ఉండి ఆక్సిజన్.. ఐసియూ కేర్ అవసరం అయిన వారికి అందుబాటులో బీ సోజో క్రిటికల్ యూనిట్ బస్సులు ఉన్నవి. మన మిర్యాలగూడలో మినీ రవీంద్రభారతి ఆవరణంలో ఈ బస్సులు ఏర్పాటు చేయబడినవి. ఎవరైనా పేషేంట్ కదలలేని స్థితిలో ఉంటే బసు మీ పేషేంట్ ఉన్న ఇంటి దగ్గరకు వస్తుంది. వెంటిలేటర్, ఆక్సిజన్, మెడిసిన్ డాక్టర్ నర్సస్ అండ్ ఫుడ్.. మినిమం రూ 5 వేలకే (గవర్నమెంట్ నిర్ణయించిన ఎంఆర్ పిలో50%) వివరాలకై డా. శివరంజన్ రెడ్డి 9666665275, రెవ. కిరణ్ కుమార్ సౌపాటి 8599243311, పాస్టర్ ఎలీషా 9849609542 సంప్రదించి అత్యంత చౌకగా కార్పోరేట్ వైద్యాన్ని మీ ప్రాంతంలో నే పొందవచ్చని రెవ డా కిరణ్ కుమార్ సౌపాటి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *