కమీషన్ల కోసమే నామినేషన్‌ పద్ధతి : జీవన్‌రెడ్డి

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న కలెక్టర్లు తుమ్మిడిహట్టిని కూడా సందర్శించాలన్నారు. మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు నామినేషన్ ద్వారా పనులు కట్టబెట్టడం సరికాదని, గ్లోబల్ టెండర్లను పిలవాల్సిందేనని జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసమే నామినేషన్ పద్ధతిని ప్రవేశపెట్టారని జీవన్‌ రెడ్డి విమర్శించారు. వినోద్‌కుమార్ తెరాస నాయకుడిగా కాకుండా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతల తుమ్మిడిహట్టి పర్యటన ప్రజలను తప్పుదోవపట్టించేదిగా ఉందని వినోద్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు జీవన్‌ రెడ్డి ఖండించారు.

 

 

 

 

 

tags : jeevanreddy, cong, kaleswaram project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *