ఒక సమాజంగా విఫలమవుతున్నాం: మహేష్

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: యువ వైద్యురాలిపై కిరాతకులు జరిపిన దారుణకాండ యావత్తు దేశాన్ని కుదిపేస్తోంది. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులందరూ ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మృగాళ్లకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఈ ఘటనపై తన స్పందనను ట్విటర్ ద్వారా తెలియజేశాడు.

`రోజులు మారుతున్నాయి. కానీ, పరిస్థితులు మారడం లేదు. ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠినతరమైన చట్టాలు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ కష్టం పూడ్చలేనిది. మనమందరం మహిళలకు అండగా నిలుద్దాం.. భారతదేశాన్ని సురక్షితంగా మార్చుదాం` అని మహేష్ ట్వీట్లు చేశారు. తన ట్వీట్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను, ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *