అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : వేయిపదాలు పలికంచలేనీ భావాలను ఒక్కఫోటో చెబుతుందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.బుధవారం నాడు రవింద్రభారతిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో జర్నలిస్టుల ఛాయచిత్ర ప్రదర్శన ను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించి ఛాయ చిత్ర ప్రదర్శన ను తిలకించారు. ఈసందర్భంగా చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ..ప్రతి ఫోటో వెనుక ఒక జ్ఞాపకం ఉంటుందని
అన్నారు.తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ నిరహర దీక్ష, మిలినియం మార్చ్,శ్రీకాంతాచారి బలిదానం వంటి ఫోటోలు చరిత్రలో నిలిచి పోతాయని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫోటో చిత్రప్రదర్శన ను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, ఈ సారి అత్యధిక సంఖ్యలో ఎంట్రీ లు వచ్చాయని అన్నారు.జర్నలిస్టుల కు అందించే సౌకర్యాలు అన్ని ఫోటోగ్రాఫర్లు కు అందిస్తామని అన్నారు. జీవం ఉట్టిపడేలా ఉన్న ఫోటోలు పదికాలాల పాటు గుర్తు ఉండిపోతాయని తెలిపారు.
చిత్రప్రదర్శన ఈనెల 14 నుండి 19 వరకు ఉంటుందని,ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల సమయం వరకు సందర్శించవచ్చని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు కు అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ ఉద్యమం లో ఫోటోగ్రాఫర్లు కీలకపాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలోభాషా,సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, టీయుడబ్లూజే ట్రెజరర్ మారుతి సాగర్,తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అద్యక్షులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
tags : photo exhibition, ravindrabharathi, allam