ఎమ్మార్పీఎస్ మహాదీక్ష వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ..

అక్షిత బ్యూరో, సూర్యాపేట :తెలంగాణ రాష్ట్రలో మంత్రివర్గ విస్తరణలో 11 మంది మాదిగ ఎమ్మెల్యే లలో ఏ ఒక్కరికిస్థానం కల్పించపోవడం పై నిరసనగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈనెల 22 న హన్మకొండలో నిర్వహించే మహా దీక్ష వాల్ పోస్టర్లను మంగళవారం వారం గాంధీ పార్క్ లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు యాతాకుల రాజన్న మాదిగ మాట్లతూ..తెలంగాణ రాష్ట్రంలో 1%ఉన్న వెలమ కులానికి 4 మంత్రులు 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 6 మంత్రి పదవులు ఇచ్చిన కేసిఆర్ అత్యధిక జనాభా 12% ఉన్న మాదిగలకు మంత్రి వర్గ విస్తరణలో కేసీఆర్ మాదిగలపైన వివక్షత చూపడం ఇప్పటికైనా మానుకొని తక్షణమే మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ నెల 22న వరంగల్ లో తలపెట్టిన మహధీక్ష కు అదిక సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీస్ సీనియర్ జాతీయ నాయకులు గుద్దెటి యల్లయ్య మాదిగ,బోడ శ్రీరాములు మాదిగ, ఎర్ర వీరస్వామిమాదిగ, వలదాస్ రెబల్ శ్రీను మాదిగ, బొజ్జ సైదులు మాదిగ వేల్పుల సుధాకర్ మాదిగ, వడ్డే ఎల్లయ్య మాదిగ ములకలపల్లి మల్లేష్ మాదిగ, ఖమ్మంపాటి రమేష్ మాదిగ ,చెరుకుపల్లి చంద్రశేఖర మాదిగ, బొజ్జ వెంకన్న మాదిగ పుట్టల మల్లేష్ మాదిగ బత్తుల వెంకటరాములు చింత వెంకన్న మాదిగ , వెంకటాద్రి ,చిoతలపాటి శ్రీను మాదిగ గురువయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

tags : mrps, mahadeeksha, poster

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *