ఎన్నికలొస్తే తప్ప కేసీఆర్ కి నిరుద్యోగులు గుర్తుండరా.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

మునగాల, అక్షిత న్యూస్: మునగాల మండలం నేలమర్రి గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్యాతిధిగా హాజరై ప్రసంగించారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి,పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కమ్యూనిస్టులకు నల్లగొండ గడ్డ ఊపిరిపోసిందని కొనియాడారు. సిపిఎం పార్టీని ఆదరిస్తున్న నేలమర్రి గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే సిపిఎం పార్టీ అక్కడ ఉంటుందని తెలియజేశారు. ఎన్నికలోచినపుడ్డల్లా కేసీఆర్ కు ఉద్యోగ భర్తీ గుర్తొస్తుందని, ఉద్యోగ భర్తీ ఓ బూటకమని ఎద్దేవాచేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణకు వరిగిందేమి లేదని అన్నారు. ఉమ్మడి నల్లగొండ,ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ లను ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే కేంద్ర, రాస్ట్రాలలో బిజెపి పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. సీపీఎం బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *