ఎన్టీఆర్ హయాంలోనే సాగర్ అభివృద్ది

సాగర్​ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మువ్వా అరుణ్​కుమార్​
అక్షిత న్యూస్, మాడుగులపల్లి :

టీడీపీ పార్టీ హయాంలోనే నాగార్జున సాగర్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని సాగర్​ టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్​కుమార్​ అన్నారుు. ఆదివారం మాడ్గులపల్లి మండలం కనేకల్ ధర్మపురం మాచనపల్లె గోపాలపురం మండలంలోని ప్రతి గ్రామంలో టీడీపీ ప్రచారం చేపట్టింది టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అధికారం అందించి పలు సంక్షేమ పథకాలను వర్తింప చేసిందన్నరు. టీఆర్ఎస్​ ప్రభుత్వంలో పేదలకు ఒరిగిందేమి లేదన్నరు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఉద్యమం సాగించిన అధికారం చేపట్టిన టీఆర్​ఎస్​ ప్రభుత్వ పాలనలో నోటిఫికేషన్లు విడుదల చేయక నిరుద్యోగులు ఆత్మబలిదానం చేసుకోవటం సిగ్గుచేటన్నారు అసమర్థ సీఎం కేసీఆర్ అని అన్నారు తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే నియోజకవర్గంలో మండలానికి ఇన్చార్జి ఎందుకు నియమించారని ప్రజలకు చెప్పాలని అన్నారు ప్రజా స్పందన లేక టిఆర్ఎస్ ప్రభుత్వం డబ్బుతోనే ప్రజలకు ముందుకు వస్తుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశామన్నారు. టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్​ జిల్లా కార్యదర్శి జడ రాములు యాదవ్​, పార్లమెంట్​ మైనార్టీ సెల్​ అధ్యక్షులు ఎం.డీ జానిమియా, మండల పార్టీ అధ్యక్షులు షేక్​ రసూల్ , త్రిపురారం మండల పార్టీ అధ్యక్షులు బలరాంరెడ్డి, సైదులు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *