ఎం ఎల్ సి కౌంటింగ్ ఏర్పాట్లకు సన్నద్ధం

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ప్రశాంత్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :వరంగల్, నల్లగొండ,ఖమ్మం పట్టభద్రుల నియోజక వర్గ ఎంఎల్సీ ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆర్జాల బావి లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం ను సందర్శించి కౌంటింగ్ కొరకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈనెల 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. 17న వరంగల్, ఖమ్మం,నల్లగొండ పట్టభద్రుల నియోజక వర్గ ఎంఎల్సీ ఎన్నిక కౌంటింగ్ నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నందున కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రం పక్కన ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతి గృహం ఆవరణ లో రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.వసతి గృహ ఆవరణ లో గడ్డి,పిచ్చి మొక్కలను తొలగించాలని,12 జిల్లాల నుంచి మార్చి14 న పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లు రిసెప్షన్ కేంద్రం కు రూట్ వారీగా వాహనాల లో చేరుకుంటాయని అన్నారు.ట్రాఫిక్ రెగ్యులేషన్ కు పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాలు లోపలికి వచ్చేలా విద్యుత్ స్తంభాలు స్థానచలనం చేయాలని ట్రాన్స్కో డీఈఈ ని ఆదేశించారు.వసతి గృహం ను పరిశీలించి 12 జిల్లాల నుంచి వచ్చే అధికారులు,సిబ్బందికి బస చేసేందుకు సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. అనంతరం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం ఆవరణలో భూమి లెవెల్ చేసి పురుషులతో పాటు మహిళలకు రెండు ప్రత్యేకంగా టాయిలెట్ లు రన్నింగ్ వాటర్ తో ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నిక బరిలో 71 మంది అభ్యర్థులు ఉన్నారని, అభ్యర్థుల సంఖ్య ను అనుసరించి బ్యాలెట్ పేపర్ ముద్రణ చేయనున్నట్టు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేందుకు తగిన సైజులో జంబో బ్యాలెట్ బాక్స్ లు సిద్ధం చేస్తున్నట్టు, బ్యాలెట బాక్స్ లు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థుల సంఖ్య,ఓటర్లు సంఖ్య పెరిగినందున కౌంటింగ్ కు గత ఎన్నికల్లో కంటే టేబుల్స్ పెంచి కౌంటింగ్ రెండు రోజులలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవం పాటిల్ తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్,ఆర్డీవోజగదీశ్వర్ రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, డీపీఆర్వీ శ్రీనివాస్,పంచాయతీ రాజ్ ఈఈ తిరుపతయ్య,పౌర సరఫరాల శాఖ డీఎం నాగేశ్వర్ రావు,విద్యుత్ శాఖ డీఈఈ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *