ఎంతటి క్లిష్టమైన… మారుతి తోడుంటే సక్సెస్

ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సిద్దార్ధ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మిర్యాలగూడ నియోజకవర్గంలోని గోప సముద్రం తండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మిర్యాలగూడ శాసనసభ్యుడు నల్లమోతు భాస్కర్ రావు తనయుడు, యువనేత సిద్దార్ధ గురువారం ప్రతిష్టించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మారుతి కృప ఉంటే ఎంతటి సమస్యనైనా సులువుగా తీరుతుందని సిద్దార్ధ అన్నారు. భక్తులంతా భక్తి,శ్రద్ధలతో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు నల్లమోతు సిద్దార్ధను పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధీరావత్ స్కైలాబ్ నాయక్, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, లావూడి శ్రీహరి నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోలు నాగార్జున, చిన్యా నాయక్, తీరంశెట్టి కోటేశ్వర రావు,    శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *