ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆదిత్య థాకరే కీలక వ్యాఖ్యలు

అక్షిత ప్రతినిధి, ముంబై:  తాను ఉప ముఖ్యమంత్రి పదివిని ఆశించడం లేదని శివసేన నేత, ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే అన్నారు. శివసేనకు చెందిన కొంత మంది నేతుల కొంత కాలంగా తదుపరి ఉప ముఖ్యమంత్రి ఆదిత్య థాకరేనేనని ప్రచారం చేస్తున్నారు. అయితే తాను దాని కోసం పరుగులు తీయడం లేదని ఉద్దవ్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే పార్టీ బాధ్యతను విస్మరించబోనని ఆయన పేర్కొన్నారు.

‘‘నేను ఏ పదవి కోసమూ పరుగులు తీయడం లేదు. ఏ పదవినీ నేను ఆశించడం లేదు. నా ముందున్న లక్ష్యం మా పార్టీ అభ్యర్థుల్లో వీలైనంత ఎక్కువ మందిని గెలిపించడమే. ఇక ప్రధాన లక్ష్యం ప్రజల ఆశయాలను నెరవేర్చడానికే పని చేస్తాను’’ అని ఆదిత్య థాకరే అన్నారు. అయితే మహా ఉప ముఖ్యమంత్రి ఎవరనేది శివసేన అధినేత ఉద్దవ్ థాకరే నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుందని అంటున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ముగిసిన మూడవ రోజు అంటే అక్టోబర్ 24న లెక్కింపు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *