ఉగ్ర కాల్పుల్లో నలుగురు పౌరులకు గాయాలు

జమ్ముకశ్మీర్: సోపోర్ జిల్లా దంగెర్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో చిన్నారి సహా నలుగురు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిఘా వర్గాలు తెలిపిన వివరాల మేరకు కశ్మీర్ లోయలో ప్రశాంతతను చెడగొట్టేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులను పంపిస్తున్నట్లుగా సమాచారం. బారాముల్లా జిల్లాలోని బొనియర్ సెక్టార్‌లో గత నెలలో భద్రతా సిబ్బంది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే-ఇ-తోయిబాతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. గుంపులుగా ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి పంపించి ఇక్కడి శాంతిని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *