ఈ బిస్కెట్లు వర్కువట్ అవుతాయా?

ఒకప్పుడు నిజంగానే ఎందుకో మన దగ్గర హీరోయిన్ల కొరత బాగానే ఉండేది. కొత్తమ్మాయిని తేవాలంటే చాలు కష్టమైపోయేది. కాని తెలుగు మార్కెట్ బాగా ఓపెన్ అయ్యాక.. దేశమంతా మన సినిమాల సత్తా తెలిశాక.. అసలు ప్రతీ మోడలింగ్ ఏజన్సీ ముందుగా అమ్మాయిల ప్రొఫైల్సన్నీ ఇక్కడికే పంపుతున్నారు. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అనేగా మీ సందేహం?

చాలామంది సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరక్క కాస్త ఇబ్బందవుతున్నా కూడా.. మాస్ రాజా మాత్రం.. రెజీనా.. రాశి ఖన్నా.. మాళవిక శర్మ వంటి ఇరవై నుండి పాతేకళ్ళ్ మధ్యున్న హీరోయిన్లతో తెరపై బాగానే రొమాన్స్ చేస్తున్నాడు. అదే తరహాలో అమర్ అక్బర్ ఆంటోని కోసం అను ఎమ్మానుయేల్ ను అనుకున్నారు. కాని డేట్లు క్లాష్‌ వచ్చాయని ఆమె ఈ సినిమా వదిలేయడంతో.. ఇలియానా సీన్లోకి వచ్చింది. అయితే అర్జెంటుగా ఏ హీరోయిన్ డేట్లు దొరక్క గోవా సుందరిని తీసుకున్నారని అందరికీ తెలుసు. అలాగే బొద్దెక్కిపోయింది కాబట్టి ఆమె అందాలు ఆరబోయలేదని కూడా అందరికీ తెలుసు. కాని ఇల్లీ మాత్రం.. ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ తెలుగులో పాతుకుపోవాలి అన్నట్లు.. ఏకంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. అందుకే ఇప్పుడు అందరికీ వచ్చే సందేహం ఒక్కటే. ఇన్నాళ్లూ టాలీవుడ్ ను కాదని.. ఇక బాలీవుడ్లో టోటల్ ఫేడవుట్ అవుతున్న తరుణంలో.. ఇప్పుడు ఇలాంటి బిస్కెట్లు వేస్తే తెలుగు నిర్మాతలు పడిపోతారా? కొత్త భామలను వద్దని 32 ఏళ్ల ఇలియానా కోసం క్యూ కడతారా?
Tags: rasikanna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *