అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏ-2 నిందితురాలు పద్మ బినామీ కంపెనీలను ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతే కాకుండా ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న బాలానగర్‌లోని వెంకటేశ్వర హెల్త్ సెంటర్ యజమాని అరవింద్‌ను అరెస్ట్ చేశారు. హెల్త్ క్యాంపుల పేరుతో భారీగా మందులు, పరికరాలను బ్లాక్ మార్కెట్లో అరవింద్‌రెడ్డి అమ్ముకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. జాయింట్ డైరెక్టర్ పద్మతో కలిసి అరవింద్‌రెడ్డి అక్రమాలు చేశారని, ఆమె తల్లి పేరుతో అరవింద్ రెడ్డికి కంపెనీలు కూడా ఉన్నట్లు బయటపడింది. బాలానగర్, దూలపల్లిలోని 3 కంపెనీలు.. సుచిత్రలోని అరవింద్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈఎస్ఐ స్కాంలో ఇప్పటి వరకు 9 మంది అరెస్ట్ అయ్యారు.
tags : esi, acb, telangana