ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్‌!

  • హైదరాబాద్‌లో 44% తగ్గిన కొత్త ప్రాజెక్టులు
  • ఆస్తుల విలువలో మాత్రం 13% పెరుగుదల
  • ప్రాప్‌ టైగర్‌ డేటా ల్యాబ్స్‌ నివేదిక

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌ సిటీ: ఆర్థిక మాంద్యం ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై కనిపిస్తోంది. హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో గృహ నిర్మాణ అమ్మకాలు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత తృతీయ త్రైమాసికం (అక్టోబరు, నవంబరు, డిసెంబరు)లో అమ్మకాలు దాదాపు 30%కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు 44%తగ్గాయి. అదే సమయంలో ఆస్తుల విలువ 13ు వృద్ధితో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ అగ్రభాగాన నిలిచింది.

నిర్మాణ రంగ ప్రాజెక్టుల క్రయ, విక్రయాలపై అధ్యయనం చేసిన ప్రాప్‌ టైగర్‌ సంస్థ తాజా నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌, గురుగావ్‌, కోల్‌కతా, నోయిడా, పుణే నగరాల్లో నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, గృహ అమ్మకాలను ఆ సంస్థ పరిశీలించింది. 2018-19 మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో 7,869 గృహాలు విక్రయించగా.. ద్రవ్య లభ్యత తక్కువగా ఉండటంతో ప్రస్తుతం 4,372 మాత్రమే విక్రయించారు.

కేంద్రం ఉద్దీపన చర్యలూ ఫలితాన్నివ్వలేదు బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 50ుకు పైగా పడిపోయాయి. సిద్ధంగా ఉన్న గృహాలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇన్వెంటరీలో గణనీయ తగ్గుదల కనిపిస్తోంది. అమ్ముడుపోని యూనిట్లు ముంబై, పుణేలో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో సగానికిపైగా ఇళ్ల ధర రూ.45 లక్షల లోపే అని నివేదిక చెబుతోంది. కోల్‌కతా, గుర్గావ్‌ల్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం భారీగా పడిపోయింది. దేశంలో ప్రారంభమైన నూతన గృహ యూనిట్లలో 40% ముంబైలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *