ఇరాక్ లో ఇందూర్ వాసుల న‌ర‌క‌యాత‌న‌…!

నకిలీ ఏజెంట్‌ చేతిలో మోసపోయిన 15 మంది నిజామాబాద్ జిల్లా వాసులు ఇరాక్‌లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కల్పిస్తానని మోసగించి వీరిని నకిలీ ఏజెంట్‌.. విజిట్‌ వీసా పై ఇరాక్‌ పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తాము మోసపోయిన విషయాన్ని బాదితులు గుర్తించారు… అయితే గత నాలుగున్నర నెలలుగా ఓ చిన్న గదిలో ఉంటూ.. స్వదేశానికి ఎలా చేరుకోవాలో తెలియక నరకం అనుభవిస్తున్నారు. తిన‌డానికి తిండి లేక చేతిలో చిల్లి గ‌వ్వ లేక నానా అవ‌స్ధ‌లు ప‌డుతున్నారు.. ఏజెంట్‌ చేతిలో మోసపోయి ఇరాక్‌లో చిక్కుకుపోయిన నిజామాబాద్‌ జిల్లా వాసులను ఆదుకోవాలని, వారిని తిరిగి స్వస్థలానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ స‌భ్యులు కొరుతున్నారు… అయితే ఇప్ప‌టికే విసిట్ విసా స‌మ‌యం ముగియ‌డంతో దానికి గానూ ఇరాక్ ప్ర‌భుత్వానికి 70 వేలు చెల్లించాల్సి ఉంటుంద‌ని, అలాగే స్వ‌దేశానికి రావ‌డానికి టికెట్ కు మ‌రో 10 వేల ఖ‌ర్చు అవుతుంద‌ని భాదితులు చెబుతున్నారు. ఎలాగైనా భార‌త ప్ర‌భుత్వం త‌మ‌ను స్వ‌దేశానికి తీసుకు రావాల‌ని కొరుతున్నారు.మ‌రోవైపు న‌కీలి ఏజెంట్ల పై చ‌ర్య‌లు తీసుకొవాల‌ని కొరుతున్నారు వారి కుటుంబ స‌భ్యులు.

Tags:
nizamabad district
iraq
Gulf countries
Telangana NRIs forum

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *