అక్షిత ప్రతినిధి, నల్గొండ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ఇంటింటా ఇన్నో వేటర్ కార్యక్రమం లో భాగంగా ఇన్నోవేటర్ సెల్, ఐ టి శాఖ, జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటా ఇన్నోవెటర్ కార్యక్రమంలో విద్యార్థులు,ప్రజలు తమ సృజనాత్మక ఆలోచనలతో రూపొందించిన ఎనిమిది ఆవిష్కరణలు ప్రదర్శన స్టాల్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా పోలీస్ పరేడ్ మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు ఈమేరకు బుధవారం జిల్లా కలెక్టర్ ఇ న్నోవేటర్ సెల్,జిల్లా పరిశ్రమల మేనేజర్ తో చర్చించారు. కొంత ప్రతేకతతో వినూత్న ఆలోచన గల వారికీ, వారు చేసిన ఆవిష్కరణలకు ఒక మంచి గుర్తింపు ఇచేలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వారి ఆవిష్కరణ ప్రదర్శించుకునేలా అవకాశం కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఆవిష్కర్తలందరు తమ వినూత్న ఆలోచనలతో వ్యవసాయ రంగంలో ఆవిష్కరణ ల ద్వారా రైతుల బాధలు తొలగించి సమయం,డబ్బు,శ్రమ తగ్గించే ఆవిష్కరణలు,ఇతర ఆవిష్కరణలు ప్రదర్శించనున్నారు.జిల్లా లోని విద్యార్థులు,ప్రజలు,ప్రజా ప్రతినిధులు ఆవిష్కరణ ల స్టాల్ ను సందర్శించి వీక్షించాలని కోరారు .ఆవిష్కరణ కర్తల ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రశంసా పత్రం తో అభినందించనున్నారు.
tags : collector, nalgonda