ఇదీ..ఇసుక మతలబు

తేదీ వేయకుండానే వే బిల్లులు జారీ
  తనిఖీ జరిగితే ఆరోజు తేదీ వేసుకుని ఇసుక దందా
  ఎంత నింపినా వేబిల్లు ప్రకారం ఉన్నట్లు రశీదు

ఎన్ని చర్యలు తీసుకున్నా ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. వ్యక్తిగత అవసరాల పేరుతో అనుమతి పత్రాలు పొంది యథేచ్ఛగా అక్రమాలు కొనసాగిస్తున్నారు. తనిఖీలు జరిగినప్పుడు ఈ పత్రాలు చూపించి తప్పించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాళ్లపాము, పొగుళ్లపల్లి మధ్యలోని ముర్రేడు వాగు నుంచి ఇసుక వాహనాలకిచ్చిన అనుమతి పత్రాలను ‘ఈనాడు’ పరిశీలించగా విస్తుపోయే వాస్తవం బయటపడింది.  ఒకే తేదీతో ఉన్న రెండు బిల్లుల నెంబర్ల మధ్య వ్యత్యాసం 40వేల పైచిలుకు. అంటే  అన్ని వాహనాల నుంచి ఇసుక ఆ రోజు వెళ్లినట్లా? ఇదెలా సాధ్యం? సిబ్బంది సహకరిస్తే సాధ్యమే మరి.. తేదీలు వేయకుండా వే బిల్లులిస్తుండటంతో అక్రమార్కులు రోజులు, వారాల తరబడి ఒకే అనుమతి పత్రంతో తరలిస్తున్నారు. ఎప్పుడైనా తనిఖీలు జరిగితే ఆరోజు తేదీ వేసుకొని తప్పించుకుంటున్నారు…ఇలా జనవరి 22వ తేదీ ఓ వ్యక్తి  ట్రాక్టర్‌ ఇసుక తీసుకెళ్లారు. రవాణాపత్రం సంఖ్య 1,77,131. అదేరోజు ఆ వాగు నుంచే కొత్తగూడెంకు చెందిన మరో వ్యక్తి ఇసుక ట్రాక్టర్‌ తీసుకెళ్లినట్లు బిల్లు ఉంది. దీని రవాణాపత్రం సంఖ్య 1,36,818. ఏ బిల్లు వాస్తవమైందో అక్రమార్కులకే ఎరుక. ఇలా కొనసాగుతున్న ఇసుక దందాపై ప్రత్యేక కథనం..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *