ఇక జానా శాశ్వతంగా ఇంట్లోనే

సంక్షేమం, ప్రగతి…గులాబీ గెలుపుకు పునాది

టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూదిమెట్ల

మాడుగులపల్లి, అక్షిత ప్రతినిధి :
ప్రస్తుత ఎన్నికల్లో జానాను ఓడిస్తే ఇక శాశ్వతంగా ఇంట్లోనే కూర్చుంటాడని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఎద్దేవా చేశారు. బుధవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మాడ్గులపల్లి మండలం, ధర్మాపురం గ్రామ టిఆర్ఎస్ నాయకులతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పుకునే వారు ఈ ప్రాంతానికి చేసింది ఏమీలేదని, గల్లీలో ఢిల్లీల్లో దిక్కులేని పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఎద్దేవా చేశారు.
హాలియాలో డిగ్రీ కళాశాల, నెల్లికల్ లిఫ్ట్, కమలానెహ్రూ ఆసుపత్రిని 18 కోట్లతో వందపడకల ఆసుపత్రిగా తీర్చదిద్దిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.
ప్రజల వద్దకు వెళ్ళే మొఖం లేకనే ఇంట్లో కూర్చోని ప్రచారం చేయాలని జానారెడ్డి అంటున్నారని, తప్పకుండా జానారెడ్డిని శాశ్వతంగా ఇంట్లోనే కూర్చోబెట్టడానికి నాగార్జున సాగర్ ప్రజలు సిద్ధమయ్యారన్నారు.తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ గెలుపుకు పునాదులు అవుతాయని ధీమావ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గొర్లపెంపకం దారుల సహకారసంఘం జిల్లా అధ్యక్షులు సోమనబోయిన సుధాకర్ యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కంపసాటి వెంకన్న, ఉప సర్పంచుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకనబోయిన శ్రీనివాస్, తెరాస జిల్లా నాయకులు బద్రబోయిన సైదులు, గ్రామ సర్పంచ్ యాదగిరి రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహ, ఉప సర్పంచ్ కొత్త శ్రీనివాస్, వార్డు సభ్యులు మొగిళ్ళ రవి, బంగారపు సైదులు, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు రామనుజన్, టీఆర్ఎస్ నాయకులు కన్నెబోయిన నాగరాజు, ప్రశాంత్, దాసరి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *