ఇంత అపవిత్రమా?… శబరిమలకు వెళ్లిన రెహానాపై నిప్పులు చెరుగుతున్న భక్తకోటి!

గతవారంలో అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన రెహానా
ఆమె తన ఇరుముడిలో వాడేసిన శానిటరీ నాప్ కిన్స్ తెచ్చినట్టు ఆరోపణలు
తీవ్రంగా మండిపడుతున్న భక్తులు
గతవారంలో శబరిమలలోని అయ్యప్ప దర్శనానికి వచ్చిన ముస్లిం యువతి రెహానాపై ఇప్పుడు హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కులమతాలకు అతీతంగా అయ్యప్పను ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చన్న భావనతో తాముంటే, ఆమె ఇంత పని చేస్తుందని అనుకోలేదని కేరళలోని భక్తకోటి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. రెహానా, వాడేసిన శానిటరీ నాప్ కిన్స్ ను తీసుకుని ఇరుముడిలో పెట్టుకుని పంబ దాటిందని వార్తలు గుప్పుమనడం, ఆపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందిస్తూ, ఇది చాలా తప్పని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించడంతో ఈ వార్త దావానలమైంది.

రెహానాను ఇప్పటికే ముస్లిం సమాజం నుంచి బహిష్కరించిన మతపెద్దలు, ఆమె చర్య మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని వ్యాఖ్యానించారు. రెహానా శానిటరీ నాప్ కిన్స్ ను పరమ పవిత్రంగా భావించే ఇరుముడిలో ఉంచిందన్న విషయాన్ని తట్టుకోలేకున్నామని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. “స్నేహితుల ఇంటికే ఇటువంటి నాప్ కిన్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేయబోము. అటువంటిది దేవుడి గుడికి తీసుకెళ్లడం ఏంటి?” అని స్మృతీ ఇరానీ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న కేరళ మహిళలు కొందరు, మత కల్లోలాలు రేపేందుకు కుట్ర పన్నిన కొందరు రెహానాతో కావాలని ఈ పని చేయించారని అంటుంటే, మరికొందరు మాత్రం పూర్తి వాస్తవాలు తెలుసుకున్న తరువాతే ఈ విషయంలో స్పందించాలని, ఒకవేళ ఆమె చేసిన పని వాస్తవమైతే, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:shabarimala, rehana, ayyappa temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *