అన్నదాతలకు అండగా నిలవాలి : రాహుల్

అక్షిత ప్రతినిధి, దిల్లీ :   కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ రైతులకు బాసటగా నిలిచారు. వరదల వల్ల పంట నష్టపోవడంతో రైతులు విలవిలలాడుతున్నారని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి తెలిపారు. అన్నదాతలకు అండగా నిలవాలని కోరారు.వ్యవసాయ రుణాల చెల్లింపుపై మారటోరియంను డిసెంబరు 31 వరకు పొడిగించాలని రాహుల్ గాంధీ ఆర్బీఐని కోరారు. ఈ మేరకు ఆయన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు లేఖ రాశారు. కేరళలో వచ్చిన తాజా వరదలు వందేళ్లలో అత్యంత దారుణమైనవని తెలిపారు. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులు భారీగా నష్టపోయారని తెలిపారు. ఇతర ఆదాయ వనరులు కూడా దెబ్బతిన్నాయన్నారు. రైతులు రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితిలో లేరన్నారు. వీటన్నిటికి తోడుగా అంతర్జాతీయంగా వాణిజ్య పంటల ఉత్పత్తుల ధరలు బాగా పడిపోయాయని పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల కూడా రైతులు నిలదొక్కుకోలేకపోతున్నారని తెలిపారు.
tags : rbi, governer, rahul

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *